బెజవాడలో న్యాయవాదిపై యాసిడ్ దాడి
విజయవాడ: విజయవాడలోని సూర్యారావు పేటలో న్యాయవాది శ్రీనివాస్ రెడ్డిపై యాసిడ్ దాడి జరిగింది. మంగళవారం మధ్యాహ్నం శ్రీనివాసరెడ్డి కేసుకు సంబంధించి ఫైలును పరిశీలిస్తుండగా ఆగంతకుడు తలుపు తట్టినట్లే తట్టి వేగంగా లోనికి ప్రవేశించి సీసాలో తెచ్చిన యాసిడ్ ను పోశాడు. దాంతో శ్రీనివాస రెడ్డి అక్కడికక్కడే కూలిపోయాడు. చికిత్స నిమిత్తం అతన్ని ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస రెడ్డి బార్ అసోసియేషన్ రాష్ట్ర సభ్యుడు.
యాసిడ్ చల్లి పారిపోతుండగా గమనించిన ఇద్దరు న్యాయవాదులు వెంటాడి ఆగంతకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడు తమ వద్ద లేడని పోలీసులు అంటున్నారు. యాసిడ్ చల్లింది ఎవరు, ఎందుకు చల్లారు అనేది పరిశీలించాల్సి ఉందని పోలీసు అధికారులు అంటున్నారు. కేసుకు సంబంధించి ఈ దాడి జరిగిందా, వ్యక్తిగత కక్షలతో జరిగిందా అనే విషయం తెలియడం లేదు. నిందితుడ్ని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications