మల్లు రవి నామినేషన్ గొడవ
{image-mallu ravi_13052008.jpg telugu.oneindia.com}మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శాసనసభా నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ వివాదంలో పడింది. గతంలో శిక్ష పడినందున మల్లు రవి నామినేషనును తిరస్కరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) డిమాండ్ చేస్తోంది. 2001లో జిల్లా పరిషత్ ఎన్నికల సందర్భంగా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మల్లు రవితో పాటు ఆరుగురు పోలీసులపై చేయి చేసుకున్నట్లు కేసు నమోదయింది.
ఆ కేసులో మల్లు రవితో పాటు ఆరుగురిపై జడ్చర్ల ఫస్టు క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఏ శిక్ష వేయాలని కోర్టు నిందితులను అడిగింది. దీంతో మల్లు రవితో పాటు ఆరుగురు మెర్సీ పిటిషన్ పెట్టుకున్నారు. దీనిపై కోర్టు ఏడాది పాటు సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశించింది. దీన్ని మల్లు రవి ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొనకపోవడంపై తెరాస అభ్యర్థి లక్ష్మారెడ్డి మామ బాల్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. అయితే అదేమంత పెద్ద నేరం కాదని, శిక్ష కూడా పెద్దగా పడలేదని మల్లు రవి తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే నేరం, శిక్ష ఎంత పెద్దదనేది కాదని, నేరం చేసినందుకు శిక్ష పడిందా, లేదా అనేదే ముఖ్యమని తెరాస అంటోంది. ఈ విషయంపై హైకోర్టుకైనా వెళ్తామని తెరాస అంటోంది.












Click it and Unblock the Notifications