రమేష్ రాథోడ్ నామినేషన్ పై నీలినీడలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ శాసనసభా నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి రమేష్ రాథోడ్ నామినేషన్ గందరగోళంలో పడింది. ఒక కేసులో ఆయనపై జిల్లా కోర్టులో కేసు విచారణ జరుగుతుండడంతో ఆయన నామినేషన్ అయోమయంలో పడింది. రెండేళ్ల క్రితం అధికారులు కడెం మండలంలో గుడిసెలను తొలగించే సమయంలో రమేష్ రాథోడ్ అడ్డు పడ్డారు. రమేష్ రాథోడ్ తమపై దాడి చేశారని కొండలరావు అనే అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ దాడి కేసులో రమేష్ రాథోడ్ కు రెండేళ్ల జైలు శిక్ష పడింది. కింది కోర్టు ఇచ్చిన ఈ తీర్పును రమేష్ రాథోడ్ జిల్లా కోర్టులో సవాల్ చేశారు. దీంతో రమేష్ రాథోడ్ నామినేషన్ చెల్లుతుందా, లేదా అనే సందిగ్ధత నెలకొంది. అయితే రమేష్ రాథోడ్ ముందు జాగ్తత్తగా తన భార్య చేత కూడా నామినేషన్ వేయించారు. రమేష్ రాథోడ్ నామినేష్ తిరస్కరణకు గురైతే ఆయన భార్య పోటీలో ఉంటారు.












Click it and Unblock the Notifications