ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాదులోని కూకట్ పల్లిలో గల నారాయణ కార్పోరేట్ కాలేజీలో దీప్తి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ భవంతిపై నుంచి దూకి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మొన్ననే ఆమె నారాయణ కోచింగ్ సెంటరులో చేరింది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురై దీప్తి ఆత్మహత్య చేసుకుందని కాలేజీ యాజమాన్యం అంటోంది. దీప్తి ఆత్మహత్యతో విద్యార్థి సంఘాలు కాలేజీ వద్ద ఆందోళనకు దిగాయి. ఆందోళనకారులు కాలేజీ ఫర్నీచర్ ధ్వంసం చేశారు.
దీప్తి స్వస్థలం కడప జిల్లా ప్రొద్దుటూరు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆమె ప్రొద్దుటూరులోనే చదివింది. మొదటి సంవత్సరంలో ఆమెకు చాలా తక్కువ మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు కూకట్ పల్లిలోని నారాయణ కోచింగ్ సెంటరులో చేర్చారు. దాంతో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు భావిస్తున్నారు. దీప్తి సోమవారం రాత్రే కళాశాల భవంతిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications