రోథోడ్ కు రెడ్ లైట్: రవికు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమేష్ రాథోడ్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అయితే మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల శాసనసభా నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ ను సంబంధిత రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. కోర్టులో శిక్షలు పడిన నేపథ్యంలో ఈ ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లపై నీలినీడలు అలుముకున్నాయి.
అధికారులను కొట్టిన కేసులో రమేష్ రాథోడ్ కు కింది కోర్టు రెండేళ్ల జైలు శిక్ష వేసింది. ఈ కోర్టు తీర్పును రమేష్ రాథోడ్ జిల్లా కోర్టులో సవాల్ చేశారు. ఈ విషయాన్ని ఉటంకిస్తూ రిటర్నింగ్ అధికారి ఎన్నికల కమీషనుకు లేఖ రాశారు. ఇదిలా ఉంటే, పోలీసులు విధుల నిర్వహణను అడ్డుకున్న కేసులో మల్లు రవిని కోర్టు మందలించి వదిలివేసింది. ఏడాది పాటు సత్ప్రవర్తన కలిగి ఉండాలని ఆదేశించింది. శిక్ష పడినందున మల్లు రవి నామినేషనును తిరస్కరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది.












Click it and Unblock the Notifications