ఈతకు వెళ్లి ఆరుగురు పిల్లల మృతి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈతకు వెళ్లి ఆరుగురు పిల్లలు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో వారు మత్స్యగెడ్డ వాగులో ఈతకు వెళ్లారు. అయితే మధ్యాహ్నం దాటినా వారు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వారి కోసం అన్వేషణ ప్రారంభించారు. తమ పిల్లలు మత్స్యగెడ్డ వాగులో కొట్టుకుపోయారని తెలిసి బోరుమంటున్నారు.
పాఠశాలలకు సెలవులు కావడంతో పిల్లలు మత్స్యగెడ్డ వాగులో ఈతకు వెళ్లారు. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వారు కొట్టుకుపోయారు. వారి శవాలు లభ్యం కాలేదు. శవాల కోసం గాలింపు ప్రారంభించారు. మృతుల్లో ముగ్గురు బాలికలు, ముగ్గురు బాలురు ఉన్నారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.












Click it and Unblock the Notifications