వైయస్ ప్రభుత్వంపై టిడిపి చార్జీషీట్

Chandrababu Naidu
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ చార్జీషీట్ విడుదల చేసింది. ఈ చార్జీషీట్ కు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని తెలుగుదేశం నాయకుడు టి. దేవేందర్ గౌడ్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టారని ఆయన విమర్శించారు. సంపదను ముఖ్యమంత్రి తన అనుచరులకు, బంధువులకు పంచిపెడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ముఠా నాయకుడిలాగా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాజశేఖర రెడ్డి ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆనయ అన్నారు.

పునరంకిత సభ ఎందుకు జరుపుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. అవినీతికి వైయస్ ప్రభుత్వం పునరంకితమైందని ఆనయ వ్యాఖ్యానించారు. ఒక్క పులివెందులకే ముఖ్యమంత్రి 8.5 వేల కోట్ల రూపాయలు వెచ్చించారని, ముఖ్యమంత్రికి పులివెందుల తప్ప ఇతర ప్రాంతాలు కనిపించడం లేదని ఆయన అన్నారు. బంధుప్రీతి, ప్రాంతీయ విద్వేషాలతో కాంగ్రెసు ప్రభుత్వం కుళ్లిపోయిందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+