హామీలపై శ్వేతపత్రానికి బాబు డిమాండ్

Chandrababu Naidu
మెదక్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారనే విషయంపై శ్వేత పత్రం విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు దోబూచులాట ఆడుతున్నారని ఆయన అన్నారు. వారు ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు మీ కోసం యాత్ర గురువారం మెదక్ జిల్లాలో ప్రవేశించింది.

ప్రజాసమస్యలపై కెసిఆర్ ఒక ఉద్యమం కూడా చేపట్టలేదని ఆయన చంద్రబాబు విమర్శించారు. బీడీ కార్మికుల సమస్యపై తెరాస పోరాటం చేయలేదని, అందువల్ల తెరాసకు ఎందుకు ఓటు వేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న ఇందిరమ్మ గృహాలు దగా అని, అవి కాంగ్రెసు గృహాలు అని ఆయన అన్నారు. ధరల నియంత్రణ తెలుగుదేశం పార్టీకే సాధ్యమని ఆయన అన్నారు. రేషన్ కార్డుపై తన ఫొటో పెట్టుకుని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంతో పండుగ చేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి వస్తే గృహాలకు ఉచితంగా 50 యూనిట్ల విద్యుత్తును సరఫరా చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+