జైపూర్ లోమూడోరోజు కూడా కొనసాగిన కర్ఫ్యూ
జైపూర్: జైపూర్ లో ఎనిమిది వరుసబాంబు పేలుళ్ళు విలయం సృష్టించిన అనంతరం మూడవరోజు కూడా కర్ఫ్యూ కొనసాగింది. ఉదయం 9:00 గంటల నుండి మధ్యాహ్నం 4:00 గంటల మధ్య కర్ఫ్యూ విధిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర హోం మంత్రి శివరాజ్ పాటిల్ పరిస్ధితులను సమీక్షించడానికి జైపూర్ రానున్నారు. డిల్లీ హోంశాఖ అధికారులు, రాజస్ధాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే ద్వారా ఎప్పటికప్పుడు పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారని, కేంద్రం నుండి ఏ సాయం కావాలన్నా అందిస్తామని పాటిల్ అన్నారు. కిషెన్ పూల్ లోని ఒక వ్యాపారి వధ్ద నుండి సైకిల్ కొన్న తీవ్రవాదులు దాన్నే పేలుడుకు ఉపయోగించారు. బుధవారం రోజు రాజస్దాన్ పోలీసులు ఆ వ్యాపారి అందించిన సమాచారం ఆధారంగా అనుమానితుడి ఊహా చిత్రాన్ని తయారు చేశారు.












Click it and Unblock the Notifications
