ఒకే జిల్లాలో ముగ్గురు ముఖ్యనేతలు

సంగారెడ్డి: రాష్ట్రానికి చెందిన ముగ్గురు ప్రధానమైన నాయకులు ఒకే రోజు గురువారం మెదక్ జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారానికి దిగారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ తరఫున రామాయంపేట శాసనసభా నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిపై, తెలుగుదేశం పార్టీపై ఆయన విమర్శలకు దిగారు. తెరాస ఎన్నికలు తేవడం వల్ల తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని ఆయన విమర్శించారు. ప్రజలకు హామీలు కూడా ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలను ఆయన వివరించారు.

రామాయంపేట నియోజకవర్గంలోని చేగుంట గ్రామంలో ఖాళీ బిందెలతో మహిళలు ముఖ్యమంత్రికి ఎదురుగా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. వారిని పోలీసులు తోసేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కాస్తా ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సిద్ధిపేట శాసనసభా నియోజకవర్గంలో ప్రచారం చేశారు. కాంగ్రెసు ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారు. బీడీ కార్మికుల సమస్యల కోసం పోరాటం చేయని తెరాసకు ఓట్లు అడిగే హక్కు లేదని ఆయన అన్నారు. మెదక్ జిల్లాలోని సదాశివపేట శాసనసభా నియోజకవర్గంలో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+