టెన్త్ లో బాలికలదే హవా
హైదరాబాద్: సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ (ఎస్.ఎస్.సి.) పదో తరగతి పరీక్షల్లోనూ బాలికలదే పైచేయి అయింది. ఎస్.ఎస్.సి. పరీక్షల్లో బాలికలు 75.84 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 73.14 శాతం ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 9 లక్షల 56 వేల 887 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష రాయగా 7 లక్షల 22 వేల 137 మంది ఉత్తీర్ణులయ్యారు. నిరుటి ఫలితాలతో పోలిస్తే ఈ ఏడాది 3.82 శాతం మంది అభ్యర్థులు ఎక్కువగా ఉత్తీర్ణులయ్యారు. పాఠశాల విద్యామంత్రి దామోదరం రాజనర్సింహ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేశారు.
ఉత్తీర్ణతలో 81.01 శాతంతో నిజామాబాద్ జిల్లా మొదటి స్థానంలో నిలువగా 58.67 శాతంతో ఆదిలాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. మహబూబ్ నగర్ జిల్లాలో 85.02 శాతం మంది, కరీంనగర్ జిల్లాలో 84.47 శాతం మంది, ఖమ్మం జిల్లాలో 81.28 మంది, పశ్చిమ గోదావరి జిల్లాలో 84.42 శాతం మంది పాసయ్యారు. కడప జిల్లాలో 77.7 శాతం మంది, విశాఖపట్నం జిల్లాలో 76.12 శాతం మంది, తూర్పు గోదావరి జిల్లాలో 77.4 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మెదక్ జిల్లాలో 73.47 శాతం మంది, అనంతపురం జిల్లాలో 70.32 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 72.84 శాతం మంది, శ్రీకాకుళం జిల్లాలో 69.52 శాతం మంది నల్లగొండ జిల్లాలో 59.9 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.












Click it and Unblock the Notifications
