మళ్ళీ భారత్ కి రాబోతున్న తస్లీమా

"ఆగస్టులో నా స్వీడన్ నివాస వీసా గడువుతీరిపోతుంది. నేను త్రిపురలో లేదా పశ్చిమ బెంగాల్ లో ఉండాలనుకుంటున్నాను. స్వీడన్, అమెరికా, జర్మనీల్లోని అసంతృప్త జీవితం కంటే భారత్ లో జీవించడమే నాకిష్టం. నేను డిప్రెషన్ తో బాధపడుతున్నాను. ఇక్కడ నా స్నేహితులు నాతో ఉన్నా నేను భారత్ ని మిస్ అవుతున్నాను. ప శ్చిమ బెంగాల్ ఉండటానికి అనుమతివ్వాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాను, వారు అనుమతి ఇవ్వకపోతే త్రిపుర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాను'' అని నస్రీన్ అన్నట్లు ఆ పత్రిక సమాచారం.
''బెంగాల్ ప్రజలు నా రచనలను ఇష్టపడతారు. చాందసవాదులు వారి తప్పు వారు తెలుసుకున్నారు. నేను తిరిగివస్తే వారెలాంటి సమస్య సృష్టించరని నేను భావిస్తున్నాను. కేవలం నేను మానవత్వం, చెడుసాంప్రదాయాల గూర్చే నా రచనల్లో ప్రస్తావించాను కానీ వాస్తవానికి నేను ఏ మతానికి వ్యతిరేకిని కాను. గుజరాత్ లో ముస్లిల పై దాడి జరిగినప్పుడు కూడా నేను నా రచనల్లో వాటిని ప్రస్తావించాను'' అని అమె అన్నారు. తస్లీమా నస్రీన్ కు భారత్ లో స్వేచ్చ, రక్షణ కల్పించాల్సిందిగా కుష్వంత్ సింగ్, అరుంధతి రాయ్ మొదలైన మేధావులు ప్రధానికి వేరువేరుగా తమ లేఖలను సమర్పించారు. చాందసవాదుల వ్యతిరేకత కారణంగా నస్రీన్ భారత్ ను విడిచి పెట్టడం తెలిసిన విషయమే.












Click it and Unblock the Notifications
