వైయస్ తెలంగాణ ద్రోహి: దేవేందర్

Devender Goud
కరీంనగర్: తెలంగాణ భూములను అప్పనంగా అమ్ముతున్న ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని తెలుగుదేశం పార్టీ నాయకుడు టి. దేవేందర్ గౌడ్ ప్రశ్నించారు. వైయస్ తెలంగాణ ద్రోహి అని, తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు వైయస్ కు లేదని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ భూస్థాపితం అవుతుందని ఆయన అన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం ధనయజ్ఞంగా మారిందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి తెలంగాణ సంపదను కొల్లగొడుతున్నారని ఆయన అన్నారు.

ఎన్నికలను ఆహ్వానించడం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు మామూలు విషయంగా మారిందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల అనంతరం తెలంగాణపై వేసిన తమ పార్టీ కమిటీ సమావేశమవుతుందని ఆయన చెప్పారు. తెరాసను ఆయన బూటకపు పార్టీగా అభివర్ణించారు. తెలంగాణ సెంటిమెంటు గురించి మాట్లాడుతున్న తెరాస ఈ ప్రాంత సమస్యలపై ఎప్పుడైనా ఉద్యమాలు చేపట్టిందా అని అడిగారు. ప్రజలను చైతన్యవంతులను చేయకుండా మాటిమాటికీ ఎన్నికలను ఆహ్వానించడం ఉద్యమ పార్టీ లక్షణమా అని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+