తెరాసపై నమ్మకం పోయింది: బాబు

తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు తెలంగాణవాదం ఓడిపోతుందని ఊహా చిత్రం గీస్తున్నారని, ప్రజా సమస్యలపై పని చేయడం లేదని, తెరాస ప్రజా సమస్యలపై పోరాడలేదని ఆయన అన్నారు. ప్రాజెక్టుల పేరు మీద ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడుతున్నారని, సంపదను ముఖ్యమంత్రి హస్తగతం చేస్తున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, ఈ విషయంలో అన్నీ చర్చిస్తామని ఆయన అన్నారు. తాము మాటకు కట్టుబడి ఉంటామనే విశ్వసనీయతను ప్రజల్లో సంపాదించుకున్నామని ఆయన చెప్పారు. చంద్రశేఖరరావు ఎందుకు రాజీనామా చేయించారని, ఆత్మరక్షణ కోసం చంద్రశేఖరరావు తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. చంద్రశేఖరరావు, రాజశేఖరరెడ్డి కలిసి ఆడుతున్న నాటకాన్ని బయటపెడతామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications