గోద్రా సంఘటన: పరిశోధనలో పురోగతి
న్యూఢిల్లి: సంవత్సరాల క్రితం గోద్రా సంఘటన అనంతరం గుజరాత్ లో సంభవించిన అల్లర్ల పై విచారణ నిమిత్తం సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక పరిశోధనాబృందం(సిట్) ప్రగతి సాధించింది. గుజరాత్ లోని ఆనంద్ జిల్లాలో ఓడె గ్రామంలో జరిపిన త్రవ్వకాల్లో ఎముకలను కనుగొన్నారు. అవి ఆల్లర్ల బాధితులవని భావిస్తున్నారు. అల్లర్ల కారణంగా ఓడే గ్రామంలో 25 మంది మరణంచారు. పిరువాలి భాగోల్, మలవ్ భాగోల్ లలో అల్లర్ల సమయంలో దహనం చేయబడ్డ ఇళ్ళ ప్రాంతాల్లోని బావుల్లో ప్రత్యేక పరిశోధన బృందం (సిట్) ఆ ఎముకలను కనుగొంది.
ఆ ఎముకల్ని పరీక్షల నిమిత్తం గాంధీనగర్ ఫోరెన్సిక్ లాబొరేటరీకి పంపారు. సుప్రీంకోర్టు గోద్రా లో రైలు దహనం, అనంతరం జరిగిన అల్లర్ల పై విచారణ జరపడానికి సిట్ ని నియమించింది. సిట్ ఏర్పడిన మూడునెల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. మాజీ సిబిఐ చీఫ్ ఆర్ కె రాఘవన్ సిట్ కి నాయకత్వం వహిస్తుండగా ఉత్తరప్రదేశ్ డిజిపి ఎ. సత్పతి, గుజరాత్, గీతా జోహ్రి, అశిశ్ భాటియా, శివానంద్ ఝా బృందంలో సభ్యలు గా ఉన్నారు.సిట్ అధికారి శివానంద్ ఝా పర్యవేక్షణలో స్దానిక అధికారులు ఆ పరిశోధనను నిర్వహిస్తున్నారు.
2002 అల్లర్లలో మాజీ ఎమ్మెల్యే ఎహ్ సాన్ జాఫ్రితో సహా 38 మంది మరణించిన గుల్బార్గ్ సొసైటీ కేసులో విచారణకై ఎనమిది సిట్ బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఒక్కొక్క బృందానికి ఒక్కో 'డిఎస్పి' ర్యాంక్ అధికారి నాయకత్వం వహిస్తున్నారు. 'సిట్' బృందాలు అల్లర్లు జరిగిన ప్రాంతాలు సంధర్శించి ఒక అవగాహనకు వచ్చారు. సిట్ బృందం ఇంతకు ముందే గోద్రా రైల్వేస్టేషన్ సమీపంలో దహనం చేయబడ్డ రైలు భోగి S6 ని పరిశీలించింది.












Click it and Unblock the Notifications