కోమాలోకి వెళ్ళిన సిపిఎం మహానేత సుర్జీత్
నొయిడా: సిపిఎం సీనియర్ నాయకుడు హరికిషన్ సింగ్ సుర్జీత్ శనివారం కోమాలోకి వెళ్ళిపోయారు. సుర్జీత్ సింగ ఆరోగ్య పరిస్ధితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. శుక్రవారం సుర్జీత్ ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో ఆయనను అత్యవసర విభాగానికి తరలించి కృత్రిమ శ్వాస ఇస్తున్నారు. సుర్జీత్ సింగ్ చికిత్సకు ప్రతిస్పందించడం లేదని, ఈ ఉదయ ఆయన కోమాలోకి వెళ్ళిపోయారని మెట్రో ఆస్పత్రికి చెందిన వైద్య బృందం ప్రకటించింది. దాదాపు యాభై ఏళ్ళుగా సుర్జీత్ సింగ్ పార్టీలో అగ్రనేతగా వెలుగుతున్నారు.












Click it and Unblock the Notifications