ఫైనల్ 'కీ' మేరకే ఫలితాలు: హైకోర్టు
హైదరాబాద్: ఫైనల్ కీ ప్రకారమే ఎంసెట్ ఫలితాలు విడుదల చేయాలని రాష్ట్ర హైకోర్టు మంగళవారంనాడు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఫైనల్ కీ విడుదలకు, ఫలితాల వెల్లడికి మధ్య సమయం ఉండాలని పిటిషనర్ కోరారు. ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి వీలుండదని పిటిషనర్ అంటున్నారు. విచారణను హైకోర్టు జూన్ 13వ తేదీకి వాయిదా వేసింది.
కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఎంసెట్ కన్వీనరును ఆదేశించింది. ఎన్నడూ లేని విధంగా ఎంసెట్ ప్రశ్నపత్రంలో 8 తప్పులున్నాయి. తొలి కీలో ఈ తప్పులను నిర్ణయించారు. ఈ నెల 23వ తేదీన ఎంసెట్ ఫలితాలు వెలువడుతున్నాయి.












Click it and Unblock the Notifications