ఉప్పునూతల నాయకుడేనా?: జీవన్
కరీంనగర్: తమ పార్టీ సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి కూడా ఒక నాయకుడైనా కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఉప్పునూతల ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని జీవన్ రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీలో ఉప్పునూతలను ఎవరూ పట్టించుకోరని ఆయన చెప్పారు.
ఉన్న పార్టీలోనే ఉప్పునూతల సరిగా ఉండరని, పార్టీ పెట్టే సీన్ ఉప్పునూతలకు లేదని ఆయన అన్నారు. ఉప్పునూతలపై చర్య తీసుకునే విషయం పార్టీ అధిష్ఠానవర్గం చూసుకుంటుందని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని, పోలింగుకు ఒక రోజు ముందు తెలంగాణ ఇస్తామని సోనియా గాంధీ స్పష్టంగా ప్రకటన చేసినా ప్రజలు ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు ఓటు వేస్తారని ఉప్పునూతల ఇటీవల అన్నారు.












Click it and Unblock the Notifications