కప్పట్రాళ్ల కేసు: మద్దిలేటి లొంగుబాటు
కర్నూలు: తెలుగుదేశం నాయకుడు కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసులో ప్రధాన నిందితుడు మద్దిలేటి నాయుడు మంగళవారం డిఎస్పీ రామనాథం ముందు లొంగిపోయాడు. ఆయన తన సోదరుడితో పాటు లొంగిపోయాడు. వారిని విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెడతామని డిఎస్పీ రామనాథం మీడియా ప్రతినిధులతో చెప్పారు. హత్యతో తనకు సంబంధం లేదని, అయితే ఆరోపణలు వచ్చాయి కాబట్టి లొంగిపోయానని మద్దిలేటి నాయుడు చెప్పాడు. తాను హత్య చేసినట్లు ఆధారాలు చూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని ఆయన చెప్పాడు.
సంఘటనా స్థలంలో లభించిన లారీ తనది కాదని ఆయన చెప్పాడు. తమ తండ్రిని చంపించారని ఆతను చెప్పాడు. కేసు చాలా కీలకమైంది కాబట్టి దర్యాప్తునకు సమయం పడుతుందని డిఎస్పీ రామనాధం చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక, పోస్టుమార్టం నివేదికల ఆధారంగా ముందుకు సాగుతామని అతన చెప్పాడు. కప్పట్రాళ్ల హత్య కేసులో నిందితురాలు పద్మక్క తమ అదుపులో లేదని ఆయన చెప్పారు. మద్దిలేటి నాయుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications