వైయస్ ను దింపడానికే...: నాయని
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి నుంచి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిని దించడానికే ఈ ఉప ఎన్నికలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ముషిరాబాద్ శాసనసభా నియోజకవర్గం అభ్యర్థి నాయని నర్సింహా రెడ్డి అన్నారు. రాజశేఖర రెడ్డి దిగిపోతే తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి పదవి లేకపోతే రాజశేఖర రెడ్డి ఏ విధమైన కొట్లాటలో పెడతారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి పదవి రాకపోతే రాజశేఖర రెడ్డి ఏం చేసేవారో అందరికీ తెలుసునని ఆయన అన్నారు. రాయలసీమ ఉద్యమాన్ని రాజశేఖర రెడ్డి చేపట్టేవారని, ఇది వరకు అలా చేపట్టిన సందర్భాలున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పదవి నుంచి దింపితేనే రాజశేఖర రెడ్డికి కనువిప్పు కలుగుతుందని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి దిగి కొత్త మంత్రివర్గం ఏర్పడాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications