చిరంజీవి రైలుకు ఎన్నారైల వంతెనలు

Chiranjeevi
హైదరాబాద్: కాలిఫోర్నియా సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రవాస చిరంజీవి సంస్ధ ఈనెల 17 వ తేదీన 5 కిలోమీటర్ల నడక కార్యక్రమాని నిర్వహించింది. చిరంజీవి రాజకీయాల్లో విజయవంతమై, ముఖ్యమంత్రి పదవి చేపట్టి, అవినీతి రహిత సమాజాన్ని స్ధాపించి పేదలను ఆదుకోవాలన్నది ఈ నడక కార్యక్రమం ప్రధానోద్దేశం. ఈ కార్యక్రమాన్ని కొద్ది రోజుల క్రితం చిరు తమ్ముడు నాగబాబు ఇక్కడ లైవ్ వీడియో ద్వారా అధికారికంగా ప్రారంభించారు. మొదటి స్పార్క్ అంతర్జాతీయ సమావేశం ఆనాడు లాంచనంగా ప్రారంభమైనట్టయింది. ప్రవాస వారధి ఉద్యమాన్ని మాతృ దేశంలో సామాజిక, ఆర్ధిక , రాజకీయ చైతన్యం కలిగించడానికి ప్రవాస భారతీయులు వ్యవస్ధాపించారు.

ప్రవాస చిరంజీవి సంస్ధ ఇప్పటివరకు 20 సమా వేశాలను అమెరికాలోని వివిధ నగరాలు, ప్రాంతాల్లో నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్ధ అధ్యక్షుడు నరసయ్య వడ్రానం మాట్లాడుతూ ప్రవాస చిరంజీవి సంస్ధ "ఎన్నారై మహాయాత్ర" ను విజయవంతంగా నిర్వహించినట్టు చెప్పారు. తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు జరిగిన ఈ యాత్రకు మంచి స్పందన వచ్చినట్టు ఆయన వెల్లడించారు. ఎన్నారై మహాయాత్రను ఆనాటి గాంధీజీ దండి యాత్రతో నాగేంద్రబాబు పోల్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.డాక్టర్ చిరంజీవి వంటి గట్టి నాయకుడు, నైతిక బలం గల వ్యక్తి మాత్రమే సమాజంలోని అవినీతిని మట్టుబెట్టి పేదరికాన్ని తొలగించి, అక్షరాస్యతను పెంపొందిచగలరని ఈ సంస్ధ విశ్వసిస్తోంది.

ప్రముఖ ప్రవాస భారతీయ విద్యావేత్తలు, ఐటి నిపుణులు, డాక్టర్లు, ఆర్కెటెక్ట్స్ ఈ ఐదు కిలోమీటర్ల నడక కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవి బొమ్మ గల టీ షర్టులు ధరించిన వీరు ప్రావాస వారధి టోపీలతో ఉత్సాహంగా, హుందాగా కన్పించారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో నడిపించగల నాయకుడు చిరంజీవి మాత్రమేనని వక్తలు గట్టిగా చెప్పారు. "మార్పు కోసం చిరంజీవి" అనే లఘు చిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. చిరంజీవి ప్రచార కార్యక్రమానికి సంబంధించిన తొలి పాటను ఈ సందర్భంగా విన్పించారు. "2008 చిరు పాట" ను జానప్రద బ్రహ్మ మానాప్రగడ నరసింహ మూర్తి కుమారుడు, ఎన్నారై మ్యూజిక్ డైరెక్టర్ సాయి మానాప్రగడ స్వర బద్ధం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+