99మంది బందీల విడుదలకు పాక్ అంగీకారం
ఇస్లామాబాద్, మే 20 : పాకిస్తాన్ తన వధ్ద బంధీలుగా ఉన్న 99మంది భారతీయులను విడుదల చేయడానికి అంగీకరించింది. బందీల్లో 96 మంది జాలర్లు, ముగ్గురు సాధారణ పౌరులు ఉన్నారు. ఇరుదేశాల మద్య ఉన్నత స్దాయి ఐదవ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగనుండగా ''సుహుద్బావ సూచకం''గా పాక్ బందీలను విడుదల చేయడానికి అంగీకరించింది. పాక్ ప్రధాన మంత్రి 'యూసుఫ్ రజా గిలాని' కార్యదర్శి రహమాన్ మాలిక్ ఈ విషయం గూర్చి ప్రకటణ చేశారు. గత వారమే భారత్ 14మంది పాకిస్తాన్ జాలర్లను విడుదల చేసి, వారిని వాఘా సరిహద్దు వద్ద పాక్ అధికారులకు అప్పగించింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 436 మంది జాలర్లు, 205 మంది సాధారణ పౌరులు పాకిస్తాన్ వద్ద బందీలుగా ఉన్నారు. పాక్ వారికి ఏ విధమైన శిక్షలు విధించిందో తెలియరాలేదు.
భారత్ అత్యున్నత స్దాయి నుండి వివిధ సమావేశాల్లో ఎప్పుడూ భారతీయుల విడుదలకై ప్రయత్నిస్తూనే ఉంది. గత సంవత్సరం విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రణబ్ ముఖర్జీ పాక్ ని సంధర్శించిన సంధర్బంలో ఖైదీల సత్వర విడుదలకు, ఆయా దేశాల్లో బందీలను పట్ల మానవతా దృక్పధంతో వ్యవహరించడం తదితర విషయాల గూర్చి చర్చించడానికి ఇరుదేశాల న్యాయమూర్తులతో జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేయాలని అంగీకారానికి వచ్చారు. మార్చి 31న ఇరు దేశాలు తమ దగ్గర ఉన్న బందీల వివరాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. జ్యుడీషియల్ కమిటీ నిర్ణయం మేరకు బందీలుగా ఉన్న జాలర్లందరినీ పాక్ ప్రభుత్వం విడుదల చేయాలని భారత్ ఆకాంక్ష.












Click it and Unblock the Notifications