తెలంగాణ సెంటిమెంట్ నిజమే: రోజా

తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ప్రజలను గాలికొదిలేస్తున్నారని, ఏ పనీ చేయడం లేదని ఆమె అన్నారు. తెలంగాణకు కాపలా కుక్కలా ఉంటానన్న కెసిఆర్ తాను కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారని, అల్లుడు హరీష్ రావుకు రాష్ట్ర మంత్రి పదవి ఇప్పించుకున్నారని ఆమె అన్నారు. ఇప్పుడు కెసిఆర్ కుమారుడు రామారావు కూడా వచ్చారని, రామారావును సిద్ధిపేట నుంచి పోటీకి పెట్టబోతున్నారని, ఇంకా కెసిఆర్ భార్య, ఇతర బంధువులు వస్తారని ఆమె అన్నారు. బిసీలను కెసిఆర్ పట్టించుకోవడం లేదని ఆమె విమర్శించారు. పార్టీని బలోపేతం చేసుకునే వరకు నరేంద్రను వాడుకుని ఆ తర్వాత మెడలు పెట్టి బయటకు గెంటారని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications