'దశావతారం' విడుదల జూన్ 7న

ఇంతకు ముందు మన సినిమాలు విదేశాల్లో విడుదలైనా ఈ చిత్రం మలేషియాలో 70 సెంటర్లలో, అమెరికాలో60 , లండన్ లో 25, శ్రీలంకలో 25, కెనడాలో 18, దుబాయ్ లో 8, సింగపూర్లో 5, ఆస్ట్లేలియాలో 5, దక్షిణాప్రికాలో 4, ఫ్రాన్స్ లో 2 సెంటర్లలో మొట్టమొదటిసారిగా విదేశాల్లో కూడా ఆత్యంత భారీగా విడుదలౌతుంది. ఇవేకాక మరో ఇరవై ప్రింట్లను వివిధ దేశాలకు పంపిస్తామని రవిచంద్రన్ అన్నారు.
"దశావతారం అత్యంత వినోదాత్మకంగా, భారీగా ఉంటుంది, ఒకే సినిమాలో పది రోల్స్ చేయడం అధ్బుత విషయం, కమల్ హాసన్ తప్ప ప్రపంచంలో మరే నటుడికీ ఇది సాధ్యం కాదు, స్ర్కిప్టు చదవగానే నేను ఇంప్రెస్ అయి వెంటనే చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించాను, ఈ అవకాశాన్నిచ్చిన కమల్ హాసన్ కు కృతఙ్ఞతలు" అని రవిచంద్రన్ అన్నారు. చిత్రం విడుదల రోజున రవిచంద్రన్ వెయ్యిమంది పేద బాలలకు ఆహారాన్నందిస్తారు. ఇది దశావతారం కి ప్రత్యేకం కాదు, గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి చిత్ర విడుదలకు ఆయన ఇలాగే చేస్తున్నారు. ఆయన ప్రతి చిత్రానికి చేసినట్లుగానే ఈ సినిమా ప్రింటుని కూడా తిరుపతి తీసుకెళ్ళి ఏడుకొండల వాడి ఆశీస్సులు తీసుకుంటారు.
సినీ చరిత్రలో దశావతారం ఒక మైలు రాయి, ఆ సినిమా విడుదల తర్వాత "దశావతారం కి పూర్వ యుగం, దశావతారానికి తరవాత యుగం" గా ప్రజలు సినీ చరిత్రని పరిగణిస్తారని, ఈ చిత్రం సినీ "విఙ్ఞాన సర్వస్వం" గా నిలిచిపోతుందని, సినిమా తీయాలనుకునే వారికి ఒక రిఫరెన్స్ పుస్తకంలా ఈ సినిమా ఉపయోగపడుతుందని రవిచంద్రన్ అన్నారు.












Click it and Unblock the Notifications