ఇంజనీరింగ్ విద్యార్థుల దొంగతనాలు
విశాఖపట్నం: దొంగతనాలకు పాల్పడుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులను ఏడుగురిని పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి నాలుగు బంగారం గొలుసులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఆరుగురిని పోలీసులు మందలించి వదిలేశారు. వాహనంపై ముగ్గురేసి చొప్పున తిరుగుతూ మహిళల మెడల్లోని గొలుసులను తెంపుకుని పోవడం చేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారి సాంబశివరావు చెప్పారు. కొన్నిసార్లు ఇతర మిత్రుల సాయంతో కూడా చైన్ స్నాచింగుకు పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. పిల్లల పట్ల తలిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications