ప్రముఖ రచయిత్రి భార్గవీరావు కన్నుమూత

ఆమె కవిత్వం, కథలు, నవలలు రాశారు. ఆమె తెలుగు నుంచి ఆంగ్లంలోకి, ఆంగ్లం నుంచి తమిళంలోకి పలు అనువాదాలు చేశారు. వంద మహిళా రచయితల కథలతో ఆమె సంకలనం చేసిన నూరేళ్ల పంట విశేష ప్రశంసలు అందుకుంది. గిరీష్ కర్మాడ్ నాటకాలకు చేసిన అనువాదానికి ఆమెకు 1995లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 1999లో తెలుగు విశ్వవిద్యాలయం అవార్డును, 2000లలో సఖ్య సాహితీ అవార్డును, 2001లో గృహలక్ష్మి అవార్డును అందుకున్నారు. తెలుగులో ఆమె ఆల్బం, నీడల గోడలు అనే కవితా సంకలనాలను, గుండెలో తడి, చుక్క నవ్వింది, నాపేరు అనే కథా సంకలనాలను, అభిసారిక అనే నవలను తెచ్చారు. ఆంగ్లంలో పెబుల్స్ ఆన్ సీ షోర్ అనే కథాసంపుటిని, మేరు కాంచన్ అనే నవలను అచ్చేశారు. తెలుగులో ఆమె నూరు వర్షాలు అనే కథా సంకలనానికి, ముద్ర అనే స్త్రీవాద కథల సంపుటికి, ఇంకానా ఇకపై సాగదు అనే దళిత కథల సంపుటికి సంపాదకత్వం వహించారు.












Click it and Unblock the Notifications