ఉప ఎన్నికలు: పోలింగుకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్: రాష్ట్రంలోని ఉప ఎన్నికల పోలింగుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 18 శాసనసభా నియోజకవర్గాల్లో, 4 లోకసభ స్థానాల్లో రేపు (గురువారం) పోలింగ్ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) రాజీనామాల వల్ల 16 శాసనసభా స్థానాలకు, 4 లోకసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది. 15 శాసనసభా స్థానాల్లోనూ, 4 లోక సభ స్థానాల్లో త్రిముఖ పోటీ తప్పడం లేదు. ముషిరాబాదులో మాత్రం చతుర్మఖ పోటీ ఉంది.

కాంగ్రెస్, తెలుగుదేశం, తెరాసల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఈ పార్టీల అధినేతలు వైయస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబునాయుడు, కె. చంద్రశేఖరరావు పోటీ పడి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ అంశమే ప్రధానంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమ కాంగ్రెసు పార్టీకి విజయం చేకూర్చి పెడతాయని రాజశేఖర రెడ్డి చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. తెలంగాణవాదమే తమకు శ్రీరామరక్ష అని కెసిఆర్ చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఈ ముగ్గురు నాయకుల భవితవ్యాన్ని కూడా నిర్ణయిస్తాయనే ప్రచారం జరుగుతోంది. ఫలితాలు రాజకీయ పరిణామాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ఈ రీత్యా ఈ ఉప ఎన్నికలకు విశేష ప్రాధన్యం చేకూరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+