చౌక బియ్యం ఎన్టీఆర్ దే: బాబు

పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం సాధ్యమవుతుందని ఆయన అన్నారు. తాను మరో 12 రోజులు రాష్ట్రంలో తిరిగి పేదల సమస్యలను, అన్ని వర్గాలను ప్రజలను అర్థం చేసుకుంటానని ఆయన చెప్పారు. ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలో అధ్యయనం చేస్తామని ఆయన చెప్పారు. మీ కోసం యాత్ర ద్వారా దేశ రాజకీయాలను పూర్తిగా మార్చి వేస్తామని ఆయన చెప్పారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని ఆయన అన్నారు. ప్రజల ఆదాయం పెరిగి, ఖర్చులు తగ్గేలా తాము విధానాలను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. ధరలు తగ్గించలేని ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులు పెడుతోందని ఆయన అన్నారు. తమ 9 పాలనలో ధరలు పెరగలేదని ఆయన చెప్పారు. గ్యాస్ ధర పెరిగిందని, బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని, గ్యాస్ ఉచితంగా ఇస్తామని, పేదల గృహ వినియోగానికి ఉచితంగా కరెంట్ ఇస్తామని ఆయన చెప్పారు.
పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని, బాకీలు మాఫీ చేయిస్తామని ఆయన చెప్పారు. రైతులకు నాణ్యమైన కరెంటును 12 గంటల పాటు పగటి పూటే ఉచితంగా ఇస్తామని ఆయన చెప్పారు. చదువుకున్న యువకులందరికీ వేయి రూపాయలేసి నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని ఆయన చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఈ సభలో హామీల వర్షం కురిపించారు. ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెసు ప్రభుత్వం ముస్లింలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. వాకిరి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
