ఢిల్లీలో ఆత్మగౌరవం తాకట్టు: హరికృష్ణ

ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజలను విస్మరించారని ఆయన అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని, అదే సమయంలో ప్రతి వస్తువు ధర పెరిగిందని ఆయన అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. కల్లబొల్లి కబుర్లు చెప్పితే ప్రజలు కాంగ్రెసును నమ్మారని, అయితే ప్రజల పాలిటి దౌర్భాగ్యంగా అది మారిందని ఆయన అన్నారు. వనరులను తెలుగుదేశం ప్రభుత్వం పెంచిందని, వాటి ఫలాలను కాంగ్రెసు ప్రజలకు అందించడంలో విఫలమైందని ఆయన అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని మళ్లీ ఇవాళ ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని ఆయన విమర్శించారు. షంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని ఆయన తప్పు పట్టారు. ఎయిమ్స్ డైరెక్టర్ వేణుగోపాల్ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కల్పించాలని ఆయన కోరారు. తెలుగుదేశం నాయకులు యనమల రామకృష్ణుడు, లాల్ జాన్ పాషా తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
