ఎండి, ఎడిటర్లపై పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణపై, సంపాదకుడు కె. శ్రీనివాస్ పై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ హైదరాబాదులోని జూబిలీహిల్స్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. బిసి సంక్షేమ సంఘం నాయకుడు ఆర్. కృష్ణయ్యతో కలిసి ఆయన బుధవారం పోలీసు స్టేషనుకు వచ్చారు. రాధాకృష్ణపై, శ్రీనివాస్ పై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని ఆయన పోలీసులను కోరారు. బాడుగ నేతలు అనే వార్త రాసిన జర్నలిస్టుపై కూడా కేసు పెట్టాలని ఆయన కోరారు.
మందకృష్ణ మాదిగ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నామని, తగిన చర్యలు తీసుకుంటామని జూబిలీహిల్స్ పోలీసు స్టేషన్ ఇన్సెపెక్టర్ చెప్పారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవులపల్లి అమర్ మీద, ప్రదర్శన సందర్భంగా తన బొమ్మను చెప్పులతో కొట్టిన జర్నలిస్టులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పత్రికా స్వేచ్ఛ పేరు మీద తమపై జర్నలిస్టులను రెచ్చగొడుతున్నారని ఆర్. కృష్ణయ్య విమర్శించారు. తమ జాతి హక్కులను, ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
