బిజెపి చేరువకు బాబు: వైయస్

YS Rajasekhar Reddy
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి దగ్గరయ్యేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. కర్ణాటకలో బిజెపి విజయం సాధించిన తర్వాత చంద్రబాబు తీరు ఆ విషయాన్ని పట్టిస్తోందని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ఓట్లడిగే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన అన్నారు. తెలంగాణ పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు చిత్తశుద్ధి లేదని, తెలుగుదేశంలో ఉన్నప్పుడు కెసిఆర్ తెలంగాణ కోసం చేసిందేమీ లేదని ఆయన అన్నారు. చంద్రబాబునాయుడు మంత్రి పదవి ఇచ్చి ఉంటే కెసిఆర్ తెరాసను స్థాపించి ఉండేవారు కారని ఆయన అన్నారు.

తాము చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలు తమ పట్ల సానుకూలంగా ఉన్నారని, ప్రభుత్వంపై ఇంత సానుకూల వైఖరిని తాను చూడలేదని ఆయన అన్నారు. అభివృద్ధి వల్ల ప్రజలకు తమపై వ్యతిరేకత లేదని ఆయన అన్నారు. తమకు అభివృద్ధి పట్ల చిత్తుశుద్ధి ఉందని ఆయన చెప్పారు. రైతులకు ఉచిత కరెంట్, రుణాల మాఫీ వంటి కార్యక్రమాల వల్ల ప్రజలు తమ పట్ల సానుకూలంగా ఉన్నారని ఆయన చెప్పారు. మరో రెండు నెలల్లో అర్హులైనవారందరికీ రేషన్ కార్డులిస్తామని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో తెలంగాణలో మూడు నెలల పాటు అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయాయని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+