ఆంధ్రజ్యోతి కథనం తప్పే: వైయస్

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) కార్యకర్తలు ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడి చేయడం తప్పేనని ఆయన అన్నారు. ఎమ్మార్పీయస్ ప్రజాస్వామిక పద్ధతుల్లో స్పందించాలని ఆయన సూచించారు. కుల ఉద్యమాల నేతలు ప్రభుత్వానికి అమ్ముడుపోతున్నారనే వార్తాకథనంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను కుల ఉద్యమాల నేతలు సమర్థిస్తున్నారు కాబట్టే, ప్రభుత్వాన్ని ఎవరూ విమర్శించడం లేదు కాబట్టే ఆంధ్రజ్యోతి వారు కక్ష పెంచుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో తెరాస ఓడినా తెలంగాణ వాదం బలహీనపడదని ఆయన అన్నారు.
పేదలందరికీ ఉచితంగా ఇళ్లు కట్టిస్తామని, బాకీలు మాఫీ చేయిస్తామని ఆయన చెప్పారు. రైతులకు నాణ్యమైన కరెంటును 12 గంటల పాటు పగటి పూటే ఉచితంగా ఇస్తామని ఆయన చెప్పారు. చదువుకున్న యువకులందరికీ వేయి రూపాయలేసి నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని ఆయన చెప్పారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పిస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఈ సభలో హామీల వర్షం కురిపించారు. ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెసు ప్రభుత్వం ముస్లింలను మోసం చేసిందని ఆయన విమర్శించారు. వాకిరి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత తీసుకుంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
