ఉప ఎన్నికలు: పోలింగ్ ప్రారంభం

వరంగల్ జిల్లా వీరుకుల్ల గ్రామంలో ఘర్షణ చెలరేగింది. కారోబార్ వద్ద ఓటర్ల గుర్తింపు కార్డులు లభించాయి. తనకు వాటిని పోలీసులు ఇచ్చారని అతను అంటున్నాడు. హన్మకొండ నియోజకవర్గంలో చేతిగుర్తు, కాంగ్రెస్ అభ్యర్తి కొండా సురేఖ ఫొటో ఉన్న స్లిప్పులు అందిస్తున్నారు. దీనిపై చర్య తీసుకుంటామని ఎన్నిక ప్రధానాధికారి ఐవి సుబ్బారావు చెప్పారు. వరంగల్ జిల్లా అక్కరాజుపల్లెలో కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. వరంగల్ జిల్లా హసన్ పర్తిలో డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ కార్యకర్తల నుంచి పోలీసులు పది వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ లో నియోజకవర్గంలోని ఒక గ్రామంలో పోలీసులు ప్రజలపై వీరంగం చేశారు. దీంతో ప్రజలు ఓటింగ్ ను బహిష్కరించారు.












Click it and Unblock the Notifications