అల్లు అరవిందే చూస్తున్నారు: చిరింజీవి

Chiranjeevi
హైదరాబాద్: తన రాజకీయ పార్టీ ఏర్పాటుపై తన బావమరిది అల్లు అరవింద్ ను అడగాలని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. జూబిలీహిల్స్ క్లబ్ లో ఏర్పాటైన పోలింగ్ కేంద్రంలో ఆయన తన కుమారుడు రామ్ చరణ్ తేజాతో కలిసి వచ్చి గురువారంనాడు ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మీ రైలు ఫ్లాట్ ఫారం మీదికి ఎప్పుడొస్తుందని అడిగితే తమ రైలు వ్యవహారాన్ని అల్లు అరవింద్ చూస్తున్నారని ఆయన సమాధానమిచ్చారు.

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. శాసనసభ్యుడు పి. జనార్దన్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఖైరతాబాద్ నియోజకవర్గానికి గురువారం పోలింగ్ జరిగింది. చిరంజీవి కన్నా ముందే వచ్చి ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్, బావ మరిది అల్లు అరవింద్ ఓటు వేసి వెళ్లారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+