సుడిగాలి సుధీర్ 'జోకర్' మూవీ టీజర్ రివ్యూ: ఈసారి కొడితే కుంభస్థలమే..!

సినిమా ఇండస్ట్రీ పైకి చూడటానికి రంగుల ప్రపంచం మాదిరి ఉంటుంది. కానీ ఆ చిత్ర సీమలో చిన్న అవకాశం కోసం ఎన్నో నిద్ర లేని రాత్రులు, తిండి తిప్పలు మాని అవకాశం కోసం ఎదురు చూసే వారు ఎందరో మనకు కనిపిస్తుంటారు. సినిమాల్లోకి రావడం అనేది ఎప్పుడూ కష్టమైనదిగానే ఉంటుంది. టాలెంట్ ఉన్నా ఎన్నో అవరోధాలను దాటుకుని నిలబడి సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో సుడిగాలి సుధీర్ ఒకరు. సుడిగాలి సుధీర్ అనగానే చాలా మందికి జబర్దస్త్ ప్రోగ్రాం గుర్తొస్తుంది. ప్రేక్షకుల్ని నవ్వించడానికి ఆయన తన లైఫ్ లో ఎన్నో కష్టాలు పడ్డారు.

SudigaliSudheer Joker Movie Teaser Review This Time He Aiming Straight for the Bullseye Sudigali

సుడిగాలి సుధీర్ ప్రస్తుతం బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇప్పుడు వెండితెరపై హీరోగా వరుస అవకాశాలు అందుకుంటున్నారు. 2019 లో సాఫ్ట్ వేర్ సుధీర్ తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత 3 మంకీస్, గాలోడు, కాలింగ్ సహస్ర, గోట్ తదితర సినిమాలు చేశారు. ఇప్పుడు హైలెస్సో, జోకర్ అనే సినిమాలు చేస్తున్నారు సుడిగాలి సుధీర్.. అయితే జోకర్ మూవీకి సంబంధించిన టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ సుధీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.

జోకర్ గ్లింప్స్ కు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. జోకర్ మూవీలో విజువల్స్ చాలా రిచ్ గా, క్వాలిటీగా ఉన్నాయి. ఇక బిగ్ బాస్ 9 ఫేమ్ అయేషా ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. జోకర్ టీజర్ చూస్తే.. ఓ ధనిక కుటుంబంలో పుట్టిన యువకుడు.. అవసరానికి మించిన ఐశ్వర్యం ఉన్నప్పటికీ దొంగతనాలు చేస్తుంటాడు. అలా చేయడానికి కారణం ఏంటి..? అనేది స్టోరీ లైన్. ఈ ఆసక్తికరమైన పాయింట్ తో గ్లింప్స్ ను దర్శకుడు చాలా స్టైలిష్ గా డిజైన్ చేశాడు. ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+