జుక్ట్ కన్సల్ట్ 'ఇండియా ఆన్ లైన్ 2008'

Posted By:
Subscribe to Oneindia Telugu

'ఇండియా ఆన్ లైన్ 2008' భారత్ లో ఒక సంవత్సరంలో ఇంటర్నెట్ వినియోగం పై జుక్స్ట్ కన్సల్ట్ వారి సమగ్ర పరిశోధన. ఆ పరిశోధన నిత్యం నెట్ వినియోగించేవారి ప్రవర్తన, ఆన్ లైన్ లో వారి ప్రాధాన్యతల గూర్చి సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని రాబట్టింది. 'ఇండియా ఆన్ లైన్ 2008' భారతీయ నెట్ వినియోగదారుల్ని అనామక నెట్ సందర్శకులుగా కాకుండా వినియోగదారులుగా గుర్తించింది.

వారి పరిశోధనలో కనుగొన్న ముఖ్య విషయాలు:
*2008లో 'భారతీయ ఆన్ లైన్' లో ఆరోగ్యకరమైన అభివృద్ది కనబడింది.
*40మిలియన్ల పట్టణ ప్రాంత, 9మిలియన్ల గ్రామీణ ప్రాంత నెట్ వినియోగదారులతో కలిపి మొత్తం 49మిలియన్ల నెట్ వినియోగదారులు ఉన్నారు.
*గత సంవత్సరంలో 33% పట్టణ ప్రాంత వినియోగదారులు పెరిగారు.
*30మిలియన్ల పట్టణ ప్రాంత వినియోగదారులు, 5మిలియన్ల గ్రామీణ ప్రాంత వినియోగదారుల్తో కలిపి మొత్తం 35 మిలియన్ల మంది క్రమం తప్పకుండా నెట్ ని వినియోగిస్తున్నారు.
*గడచిన సంవత్సరంలో క్రమం తప్పకుండా నెట్ ని వినియోగించే వారి సంఖ్య 19% పెరిగింది.
*25 మిలియన్ల మంది క్రమంతప్ప కుండా నెట్ ని వినియోగిస్తున్నారు.
( క్రమం తప్పకుండా ఇంటర్నెట్ ను వినియోగించేవారు = అంతర్జాతీయంగా అంగీకరించిన ప్రమాణం ప్రకారం నెలకొకసారైనా నెట్ కి వచ్చేవారు)
పేద, ధనిక వర్గాల్లో నెట్ వినియోగం పెరిగింది. 77% నెట్ వినియోగదారులు 19 నుండి 35 సంవత్సరాల మధ్య వయసువారే. 70% నెట్ వినియోగదారులు సెక్షన్ A, B ,C టౌన్లకు సంబంధించినవారు. 51% వినియోగదారులు ఉధ్యోగులు, 63% వినియోగదారులు ఒక వాహనాన్ని కలిగివున్నారు. 28% వినియోగదారులే ఆంగ్లంలో నెట్ లో సమాచారాన్నిచదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని బట్టి ప్రాంతీయ భాషల్లో సమాచార ప్రాధాన్యం అవగతం అవుతుంది.

ఇంటర్నెట్ వినియోగదారుల గృహోపకరణాలు

గృహోపకరణాలు కలిగి ఉన్న వినియోగదారులు
కలర్ టి.వి. 90%
మొబైల్ ఫోన్ 87%
బ్యాంకు ఖాతా 84%
కంప్యూటరు, లాప్ టాప్ 72%
ఫ్రిజ్ 68%
జీవిత భీమా 53%
ద్విచక్ర వాహనం 46%
క్రెడిట్ కార్డు 31%
ఎయిర్ కండిషనర్ 19%
కారు మొదలైనవి 17%
షేర్లలో పెట్టుబడులు 11%

ఇంటర్నెట్ వినియోగదారుల నిత్య జీవితాన్ని ప్రభావం చేస్తుంది
41% మంది ఇంటినుండే బ్రౌజ్ చేయడానికి ఉత్సుకత చూపారు.
ప్రతి పది మందిలో తొమ్మిది మంది ప్రతిరోజు ఇంటినుండి, ఆఫీసు నుండి బ్రౌజ్ చేస్తున్నారు.
ఇతర సాధనాలకన్నా అధికంగా కొందరు ప్రతిరోజూ రెండు గంటలు మరికొందరు అంతకన్నా ఎక్కువగా ఇంటర్నెట్ కి సమయం కేటాయిస్తున్నారు.
-36% వారానికి రెండు గంటలు, అంతకన్నా ఎక్కువ సమయం ఇంటర్నెట్ కి కేటాయిస్తున్నారు.
-14% వారానికి రెండు గంటలు, అంతకన్నా ఎక్కువ సమయం టి.వి. చూడటానికి కేటాయిస్తున్నారు.
-2% వారానికి రెండు గంటలు, అంతకన్నా ఎక్కువ సమయం పత్రికలు చదవడానికి కేటాయిస్తున్నారు.
-10%వారానికి రెండు గంటలు, అంతకన్నా ఎక్కువ సమయం రేడియో వినడానికి కేటాయిస్తున్నారు.
81% సోషల్ మీడియా ప్లాట్ ఫాం (చాటింగ్, సామాజిక, వృత్తి పరమైన అవసరాలు, వివిద కమ్యూనిటీల లో భావవ్యక్తీకరణ, చదవడం, కామెంట్లు, బ్లాగులు వ్రాయడం మొదలైనవి) ద్వారా నిత్యం కలుస్తున్నారు.
అవసరం ప్రాధాన్యత
ఇ-మెయిళ్ళు పంపడం 91%
ఉధ్యోగ అన్వేషణ 72%
తక్షణ సమాచారం, చాటింగ్. 70%
వార్తలు చదవడం 63%
రీడల కోసం 57%
పాటలు సినిమాల డౌన్ లోడు. (దిగుమతి?) 54%
రికెట్ స్కోరు వివరాలకోసం. 50%
డేటింగు, స్నేహం. 50%
పెళ్ళి సంబంధాల వేట. 49%
ంగ్ల సమాచార సెర్చ్ ఇంజన్. 49%

నిత్య జీవితంలో ఇంటర్నెట్
సగటున ఒక నెట్ వినియోగదారుడు ఆన్ లైన్లో జరిపై 15కార్యకలాపాల్లో ప్రాధాన్యం ఉన్న 10లో 7 వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి.
ప్రాంతీయ భాషల వెబ్ సైట్లను సందర్శించే వారి సంఖ్య గత సంవత్సరం 12% కాగా అది ఇప్పుడు 34శాతానికి పెరిగింది. (28% మందే ఆంగ్ల భాషలో ఉన్న వెబ్ సైట్లను సందర్శించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీన్నిబట్టి 72% ప్రాంతీయ భాషలో నెట్ వినియోగించాలని అనుకుంటున్నారు. అయినా ప్రాంతీయ భాష సైట్లను సందర్శించే వారు 34 శాతమే. దీనికి కారణం ప్రాంతీయ భాషల్లో వెబ్ సైట్లు తక్కువగా ఉండి సమాచారం కూడా తక్కువగా లభ్యం అవడం.

ప్రతి ముగ్గురు ఆన్ లైన్ షాపింగ్ చేసే వాళ్ళలో ఒకరు ఆన్ లైన్లో వస్తువుల్ని కొంటున్నారు
*క్రమం తప్పక ఆన్ లైన్ లో ఉండే భారతీయుల్లో 80% ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్నారు. వారు ఆన్ లైన్ లో వస్తువుల గూర్చి వెతకడం గానీ లేదా కొనడం గానీ చేస్తున్నారు.
*23% ఆన్ లైన్ లో వస్తువులు కొని ఉన్నారు. గత ఆరునెలల్లో 8మిలియన్ల మంది ఆన్ లైన్ లో వస్తువుల్ని కొన్నారు.
*92% ఆన్ లైన్ కొనుగోలుదారులు (నెట్ వినియోగదారుల్లో 23%) ప్రయాణానికి సంబంధించిన కొనుగోలు, 51% ఇతర వస్తువుల్ని కొనుగోలు చేశారు.
* గత ఆరునెలల్లో ప్రయాణానికి సంబంధించిన వస్తువుల కొనుగోలు చేసేవారిలో 80% రైలు టికెట్టుని కొన్నారు. 52% విమాన టికెట్టును కొనుగోలు చేశారు.
*ఇతర వస్తువుల కేటగిరి లో పుస్తకాలు, బట్టలు, సిడిలు/డివిడిలు అత్యధికంగా అమ్ముడవుతున్న వస్తువులు. (మోబైల్స్, సెల్ ఫోన్లు ను ఆన్ లైన్ లో ఎక్కువగా వెతికినా వాటిని షాపుల్లోనే కొంటున్నారు.

వెబ్ సైట్ బాగా గుర్తుండేది బాగా ఉపయోగించేది
గూగుల్ 36.6% 28.4%
యూహూ 31.5% 27.6%
రీడిఫ్ 7.4% 8.6%
ఆర్కుట్ 5.6% 8.1%
జి మెయిల్ 5.5% 8.6%
ఇండియా టైమ్స్ 1.7% 1.2%
హాట్ మెయిల్ 1.1% 1.0%
మనీ కంట్రోల్ 0.8% 0.8%
నౌకరీ 0.7% 0.4%
సిఫీ 0.6% 0.7%

ఒక ప్రత్యేకమైన అవసరానికి ఎక్కువగా ఉపయోగించే వెబ్ సైట్

అవసరం ఉపయోగించే సైటు వినియోగించే వారి శాతం
ఇ-మెయిళ్ళు యాహూ 51%
తక్షణ సమాచారం పంపడానికి యాహూ 53%
ఉధ్యోగాన్వేషణ నౌకరి 42%
నెట్ లో వార్తలు యాహూ 16%
ఆంగ్లం లో సమాచారాన్ని వెతకడానికి గూగుల్ 81%
ప్రాంతీయ భాషలో సమాచారం వెతకడానికి గూగుల్ 65%
ప్రయాణ సమాచారం యాత్ర 18%
ఆటలు జపాక్ 32%
ఆన్ లైన్ కొనుగోళ్ళు(ప్రయాణ అవసరాలు కాకుండా) ఇ బే 33%
రియల్ ఎస్టేట్ గూగుల్ 23%
ఆర్దిక సంబంద వార్తలు ఇన్ఫో మనీ కంట్రోల్- 18%
ఆన్ లైన్ షేర్ బిజినెస్ ఐసిఐసిఐ డైరెక్ట్ 31%
నెట్ టెలిఫోన్ యాహూ 25%
వివాహ సంబంధాలు భారత్ మ్యాట్రిమొని 36%
స్నేహం/డేటింగ్ ఆర్కుట్ 44%
ఫోటోలను ఇతరులతో పంచుకోడానికి ఆర్కుట్ 43%
సోషల్ నెట్ వర్కింగ్ ఆర్కుట్ 38%
వృత్తి సంబంధ నెట్ వర్కింగ్ ఆర్కుట్ 66%
వీడియోలను ఇతరులతో పంచుకోడానికి యుట్యూబ్ 43%
క్రీడలు క్రిక్ ఇన్ఫో 19%
జ్యోతిష్యం యాహూ 25%
సినిమా యాహూ 14%
పాటలు రాగా 17%
ఆన్ లైన్ విధ్య ఎడ్యుకేషన్ గూగుల్ 32%
సినిమా సిడిల కొనుగోలు, అద్దె రీడిఫ్ 19%
మోబైల్ లో సమాచారం యాహూ 12%

ఇండియా ఆన్ లైన్ 2008 వారి సర్వే లో అనుసరించిన పధ్దతులు
* నెట్ వినియోగదారును అంచనా వేయడానికి2008 మార్చి నెలలో ఒక ఫీల్ట్ సర్వే చేసారు.
*సమాజంలోని అన్ని ఆర్దిక, సామాజిక తరగతుల వారిని దేశమంతటా కవర్ చేస్తూ జనాభా పరిమాణం వేరువేరుగా ఉన్న 40 నగరాల్లో 12,500 ఇళ్ళలో, 160 గ్రామాల్లో 4,000 ఇళ్ళలో సర్వే చేశారు.
* ఇంటర్నెట్ వినియోగంలో మార్పులు, వారి అలవాట్లు, ప్రవర్తన, వారు ఇష్ట పడే వెబ్ సైట్ ల గూర్చిన సమాచారాన్ని పెద్ద ఎత్తున జరిపిన ఆన్ లైన్ సర్వే లో 15,000 నెట్ వినియోగదారుల్నుండి 2008 ఏప్రిల్లో సమాచారాన్ని సేకరించారు.
*గూగుల్ లో' కీలక పదాలు'(key words), ప్రకటణల ఎంపిక మరియు జుక్స్ ట్ కన్సల్ట్ వారి సొంత ఇంటర్నెట్ ప్యానెల్ (గెట్ కౌంటెడ్)సాయంతో సర్వే చేశారు.
*ఆన్ లైన్ సర్వేలో పట్టణ, గ్రామీణ ప్రాంత నెట్ వినియోగదారుల అభిప్రాయాలను సేకరించే విధంగా జాగ్రత్త తీసుకున్నారు. దానికై వారు ఫీల్ట్ సర్వే చేసి, ఖచ్చితమైన భారత ప్రభుత్వ జనాభా గణాంకాల్ని ఉపయోగించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి