డిచ్ పల్లి కాంగ్రెస్ కైవసం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి శాసనసభా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత విజయం సాధించారు. ఆమె తమ సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండవ వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. ఆకుల లలిత మొదటి నుంచి ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చారు.
తెలంగాణ రాష్ట్రసమితి (తెరాస) అభ్యర్థి ఆనంద రెడ్డి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజా మాజీ శాసనసభ్యుడు గంగారెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో తెరాస టికెట్ ఆయన కుమారుడు ఆనందరెడ్డికి ఇచ్చారు.












Click it and Unblock the Notifications