పార్టీ పదవికి కెసిఆర్ రాజీనామా యోచన

హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాలతో తీవ్ర నిరాశకు గురైన కె. చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఎన్నికల ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని అందుబాటులో ఉన్న తెరాస నాయకులకు చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన తన మనోభావాలను వారితో పంచుకున్నారు.

అధ్యక్ష పదవికి రాజీనామా చేయవద్దని నాయకులు ఆయనను వారిస్తున్నారు. కెసిఆర్ రాజీనామా వల్ల పార్టీ బలహీనపడుతుందని వారు వాదిస్తున్నారు. కెసిఆర్ నాయకత్వంలోనే పార్టీ ముందుకు సాగుతుందని, తెలంగాణవాదం బలపడుతుందని వారంటున్నారు. ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని భావించిన కెసిఆర్ సగం సీట్లు కూడా లభించకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. తన మెజారిటీ కూడా కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో గణనీయంగా తగ్గడం ఆయనను తీవ్రంగా కలత పెట్టిందని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+