కరీంనగర్ లో గట్టెక్కిన కెసిఆర్
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఎట్టకేలకు కరీంనగర్ లోకసభ నియోజకవర్గంలో గట్టెక్కారు. కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డిపై ఆయన కేవలం 15 వేల 289 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రమణ మూడో స్థానంలో నిలిచారు. కరీంనగర్ లోకసభ ఎన్నికల్లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపులో జీవన్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు జరుగుతున్న కొద్దీ జయాపజయాలు ఇరువురు అభ్యర్థుల మధ్య విజయం దోబూచులాడింది.
ఇంతకు ముందు జరిగిన ఉప ఎన్నికలో కెసిఆర్ రెండున్నర లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ స్థానంలో ఇప్పుడు కూడా పాత అభ్యర్థులే పోటీ చేశారు. ఈసారి కెసిఆర్ చాపు తప్పి కన్ను లొట్టబోయినట్లు గెలుపొందారు. కెసిఆర్ ఇంత తక్కువ మెజారిటీతో విజయం సాధిస్తారని ఎవరూ అనుకోలేదు. రాజకీయంగా ఇది కెసిఆర్ కు పెద్ద దెబ్బనే. ఆయన తన విధానాలను, వైఖరులను పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఫలితం తెలియజేస్తోంది.












Click it and Unblock the Notifications