లోకసభ సీట్లు: తెరాసకు రెండే
హైదరాబాద్: లోకసభ స్థానాల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)పై దెబ్బ పడింది. రెండు లోకసభ సీట్లను అది కోల్పోయింది. తెరాస రెండు సీట్లను నిలబెట్టుకోగా, మరో రెండు స్థానాలను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పంచుకున్నాయి. తెరాస కరీంనగర్, హన్మకొండ స్థానాల్లో విజయం సాధించింది. కరీంనగర్ లోకసభ స్థానంలో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి టి. జీవన్ రెడ్డిపై కొద్ది మెజారిటీతో మాత్రమే గెలిచారు. కేవలం 15 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీ మాత్రమే కెసిఆర్ కు రావడం తెరాస వర్గాలను నిరాశ పర్చింది. హన్మకొండ లోకసభ స్థానంలో తెరాస అభ్యర్థి వినోద్ కుమార్ తిరిగి గెలుచుకున్నారు.
ఇక, అనూహ్యంగా వరంగల్ లోకసభ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకరరావు గెలుచుకున్నారు. తెరాస అభ్యర్థి రవీంద్రనాయక్ అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. ఇక ఆదిలాబాద్ లోకసభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి విజయం సాధించారు. మొదటి నుంచి ఆయన ఆధిక్యంలోనే కొనసాగారు. తెరాస సిట్టింగ్ ఎంపి మధుసూదన్ రెడ్డి పరాయం పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ ఎస్ వేణుగోపాలాచారి ఓడిపోయారు.












Click it and Unblock the Notifications