కెసిఆర్ కు జీవన్ నుంచి గట్టి పోటీ

కరీంనగర్: కరీంనగర్ లోకసభ సీటులో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కాంగ్రెస్ అభ్యర్థి టి. జీవన్ రెడ్డి నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కుంటున్నారు. మొదట ఆధిక్యతలో కొనసాగిన చంద్రశేఖరరావు తర్వాత వెనకబడ్డారు. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి జీవన్ రెడ్డి 875 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. నాలుగు లోకసభ స్థానాలకు, 18 శాసనసభా నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

గత ఎన్నికల్లో కెసిఆర్ రెండు లక్షలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పోలింగ్ తక్కువగా జరిగింది. కెసిఆర్ తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి రావడం పార్టీని కలవరపెట్టే విషయమే. కరీంనగర్ లోకసభ సీటు ఫలితంపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. తొలి రౌండ్ తర్వాత కెసిఆర్ మళ్లీ మెజారిటీకి వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+