విజయాన్ని ఆపలేకపోయారు: రాము
కరీంనగర్: కరీంనగర్ లో తమ విజయాన్ని ఆపలేకపోయారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కుమారుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి కె. తారకరామారావు అన్నారు. విజయమే ఉంటుంది గానీ సాంకేతిక, నైతిక విజయాలు ఉండవని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. కరీంనగర్ లోకసభతో పాటు జిల్లాలో మూడు శాసనభా నియోజకవర్గాల్లో ప్రజలు తమను గెలిపించారని, ప్రజలు సంపూర్ణంగా తమ పక్కన నిలిచారని ఆయన అన్నారు. అయితే ఈ ఎన్నికల నుంచి తాము నేర్చుకోవాల్సింది ఉందని ఆయన అన్నారు.
కెసిఆర్ మెజారిటీ తగ్గడానికి పోలింగ్ శాతం తగ్గడం, రెండు లక్షల మందికి పైగా యువకులు హనుమాన్ దీక్షకు వెళ్లడం, తమ పార్టీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా వ్యక్తం కావడం కారణాలని ఆయన అన్నారు. తమను గెలిపించిన కరీంగనగర్ జిల్లా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్ అసంతృప్తిగా ఉన్నట్లు తమ దృష్టికి రాలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పకడ్బందీ ప్రచారం వల్ల కూడా కరీంనగర్ లోకసభ స్థానంలో తమ మెజారిటీ తగ్గిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications