టిడిపి ఖాతాలో ఘనపూర్, రామాయంపేట
హైదరాబాద్: వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ శాసనసభా నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి విజయరామారావు ఓటమి చవి చూశారు. ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరిపై ఓడిపోయారు. విజయరామారావు తెరాస శాసనసభా పక్ష నేతగా పని చేశారు. స్థానికంగా తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపించాయని కడియం శ్రీహరి అంటున్నారు. విజయరామారావు నియోజకవర్గం ప్రజలను పట్టించుకోలేదనేది ఆయన నింద.
అలాగే రామాయంపేట శాసనసభా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హనుమంతరావు గెలిచారు. ఆయన తెరాస అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డిపై పది వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జడ్చర్ల శాసనసభా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి విజయం సాధించారు. తెరాస అభ్యర్థి లక్ష్మా రెడ్డి ఓడిపోయారు.












Click it and Unblock the Notifications