త్రిముఖ పోటీలో హోరాహోరీ
హైదరాబాద్: రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠను నెలకొల్పుతోంది. చాలా స్థానాల్లో నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. త్రిముఖ పోటీలో క్షణక్షణానికి ఆధిక్యతలు మారుతున్నాయి. తెర్లాం, ఖైరతాబాద్ స్థానాల్లో మెజారిటీ ఏకపక్షంగా సాగుతోంది. తెర్లాంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఖైరతాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డి ఆధిక్యతలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఫలితాల ప్రకారం 18 శాసనసభా నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) 7 స్థానాల్లో, కాంగ్రెస్ ఆరు స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతుండగా, నాలుగు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యతలో కొనసాగుతోంది.
ముషీరాబాద్ లో బిజెపి అభ్యర్థి డాక్టర్ లక్ష్మణ్ ఆధిక్యతలో కొనసాగుతున్నారు. లోకసభ స్థానాల్లో అనూహ్యంగా కరీంనగర్ లో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కుంటున్నారు. ఆదిలాబాద్, వరంగల్ స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యతలో కొనసాగుతోంది. హన్మకొండలో మాత్రం తెరాస అభ్యర్థి దూసుకుపోతున్నారు.












Click it and Unblock the Notifications