దొమ్మాటలో తెరాస విజయం
మెదక్: ఉప ఎన్నికల్లో తొలి ఫలితం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి అనుకూలంగా వచ్చింది. మెదక్ జిల్లా దొమ్మాట శాసనసభా నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముత్యంరెడ్డిపై స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. రామలింగారెడ్డికి ముత్యంరెడ్డిపై 2267 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.
2004 శాసనసభ ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి ముత్యంరెడ్డిపైనే గెలుపొందారు. జర్నలిస్టు అయిన రామలింగారెడ్డి 2004 ఎన్నికలతోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఉప ఎన్నికల్లో తిరిగి ఆయనే అభ్యర్థి అయ్యారు. దొమ్మాటలో తెరాస పరిస్థితి అంత బాగా లేనట్లు తొలుత భావించారు. అయితే పోలింగ్ దగ్గర పడేసరికి రామలింగారెడ్డి పుంజుకున్నారు.












Click it and Unblock the Notifications