కెనడా,అమెరికాల్లో చిరంజీవి స్పార్క్ సమావేశాలు

Chiranjeevi
హైదరాబాద్: తెలుగు ఆర్గనైజేషన్ ఆద్వర్యంలో విండ్సర్ కెనడాలోనూ, అమెరికాలోని చికాగో, కొలంబస్ నగరాల్లో సంయుక్తంగా నిర్వహింపబడిన స్పార్క్ సమావేశాలు విజయవంతం అయ్యాయని మీడియా సెక్రటరీ రావు సిద్దం ఒక ప్రకటణలో తెలిపారు. మే 31న కెనడాలో విజయవంతంగా జరిగిన స్పార్క్ సమావేశంతో స్పార్క్ అంతర్జాతీయంగా మరో దేశంలోకి విజయవంతంగా అడుగుపెట్టినట్లయింది. ప్రొ తెలుగు ఆర్గనేజేషన్ అమెరికాలోని మరో రెండు నగరాల్లో కూడా సమావేశాల్ని నిర్వహించింది. డాక్టర్ ఎ.పి.విఠ్ఠల్ ఎన్నారై లను ఉద్దేశిస్తూ చేసిన ఉపన్యాసం ప్రత్యక్ష ప్రసారంతో ఈ సమావేశాలన్నీ ఏకకాలంలో ప్రారంభమయ్యాయి. ఆంధ్ర ప్రధేశ్ లోని విజయవాడ నుండి టెలికాన్ మాధ్యమం ద్వారా సామాజిక, ఆర్దిక, విద్య , ఆరోగ్య రక్షణ సమస్యలు వాటి పరిక్షారమార్గాలను గూర్చి డాక్టర్ విఠ్ఠల్ మాట్లాడారు. ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన టెలికాన్ ద్వారా సమాధానాలిచ్చారు. ప్రొ తెలుగు ఆర్గనైజేషన్ వ్యవస్దాపక అధ్యక్షుడు, ప్రస్తుత కార్యదర్శి శ్రీ రామ్ తాతినేనిగారు డాక్టర్ విఠ్ఠల్ కు, సమావేశానికి హాజరైన ఎన్నారైలకు తమ కృతఙ్ఞతలు తెలిపారు. డాక్టర్ మిత్రా, డాక్టర్ కె. నాగేశ్వర్, నాగేంద్ర బాబు గార్ల వీడియో సందేశాలను ప్రదర్శించారు.

ఎన్నారైలను ఉద్దేశిస్తూ తెలుగు భాష ప్రాధాన్యతను వివరిస్తూ దాని ఔన్నత్యాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యతను గుర్తుచేశారు. పలు సామాజిక, విద్య, ఆరోగ్య విషయాలపై డాక్టర్ విఠ్ఠల్ ముప్పై నిముషాలకు పైగా ప్రసంగించారు. ఆ ప్రసంగానికి స్పందిస్తూ ఆంధ్ర ప్రధేశ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యల గూర్చి ఎన్నారైలు అడిగిన పలు ప్రశ్నలకు కూడా డాక్టర్ విఠ్ఠల్ సమాధానాలిచ్చారు. అదే టెలికాన్ బ్రిడ్జి పై ప్రొ తెలుగు వ్యవస్ధాపక అధ్యక్షులు మరియు జనరల్ సెక్రటరీ అయిన శ్రీ రాం తాతినేని డల్లాస్ నుండి డాక్టర్ విఠ్ఠల్ గారికి , సభకు విచ్చేసిన ఎన్నారైలకు ధన్యవాదాలు తెలిపారు. తరువాత జరిగిన కార్యక్రమంలో డాక్టర్ మిత్ర, నాగేంద్రబాబు, డాక్టర్ కె. నాగేశ్వర్ ల డెట్రాయిట్ సమావేశానికి చెందిన మొదటి స్పార్క్ సమావేశ వీడియోలను ప్రదర్శించారు.

చికాగోలో జరిగిన మేధో మధన సదస్సులో విద్య, ఆరోగ్య, ద్రవ్యోల్బణం, మహిళా సమస్యలు, రైతులకు గిట్టుబాటు ధరలు, నేర మరియు న్యాయ వ్యవస్ద వంటి పలు విషయాలపై రాం దొండపాటి,పవన్ దాసన్, సత్య గోపాలం, సుమన్, వెంకట్, శ్రీ బసాబత్తిన రాజా, శ్రీధర్ దండె, గీత, సరిత, శ్వేత రేఖ, సంగీత,శ్రీ కాంత్ కొండపల్లి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మరోచోట కొలంబస్ లో స్పార్క్ సమావేశంలో సిద్దార్ద అన్నెబోయిన ప్రస్తుత వైద్య విధానాలపై, ఆరోగ్య భీమా పధకాలపై అమెరికా అవలంబిస్తున్న విధానాలను, భారత దేశ విధానాలతో విశ్లేషించారు. కిరణ్ మదారి మాట్లాడుతూ పిల్లల విధ్యావిధానంలో తల్లిదండ్రుల భాద్యత గురించి వివరించారు. మరొక వక్త కవిత రెడ్డి వెన్నపూస విద్య, వైద్య విషయాలపై మాట్లాడారు. సూర్య గుండుబోగుల, అరుణ్ బండారి, నాగ శ్రీనివాస్ పలు విషయాలపై చర్చించారు. తదుపరి మెగాస్టార్ చిరంజీవి నటించిన "స్టాలిన్" సినిమా ప్రదర్శించారు. విండ్సర్ కెనడాలో జరిగిన వేరొక సమావేశంలో సురేష్ సోమిశెట్టి, రాం శ్యాం దండె, వెంకట్ బీరం తదితరులు పాల్గొన్నారు. ఒకేసారి ఇరు దేశాల్లో జరిగిన ఈ స్పార్క్ సమావేశాల్లో పాల్గొన్న ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకై చిరంజీవి నాయకత్వం రావాలని కోరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+