తిరుపతి: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి సోమవారంనాడు తిరమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆమె తిరుమలేశుని దర్శించుకున్నారు. వారంతా సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఆదివారం రాత్రి ఆమె తిరుపతి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. సోమవారం ఉదయమే ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె రాక సందర్భంగా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.