వైయస్ తో హరీష్ రావు భేటీ

ఉప ఎన్నికల ఫలితాల విషయంలో తాను ముఖ్యమంత్రిని అభినందించానని ఆయన చెప్పారు. తెరాస తమకు మిత్రపక్షమేనని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఈ స్థితిలో హరీష్ రావు ముఖ్యమంత్రిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రితో ఆయన 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. సినీనటుడు రాజశేఖర్, ఆయన భార్య జీవిత కూడా సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. జీవితను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించవచ్చుననే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం చేకూరింది.












Click it and Unblock the Notifications