హైదరాబాద్: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ముఖ్యమంత్రి వైఎస్ చేసిన అభివృద్ధి ఫలితమే అని 'వైఎస్ఆర్ యువసేన యుఎస్ఎ కమిటీ' ఒక ప్రకటలో తెలిపింది. వైఎస్సార్ నాలుగేళ్ళ పాలన తర్వాత కూడా ఫలితాలు కాంగ్రెస్ కి అనుకూలంగా ఉండటం వారి ఆనందానికి ఒక కారణమైతే జీవన్ రెడ్డి పై కెసిఆర్ నామమాత్రపు మెజార్టీ మాత్రమే సాధించడం, 17 తెలంగాణా సీట్లలో గతంలో తెరాస సీట్లైన ఆరింటిని కాంగ్రెస్ గెలుచుకోవడం వారి ఆనందానికి మరో కారణం. ప్రజలు కాంగ్రెస్ సాధించిన అభివృద్దిని, సంక్షేమ పథకాలను ఈ విధంగా ఆశీర్వదించారని, వైఎస్సార్ కష్టించే స్వభావాన్ని, చిత్తశుధ్దిని, అంకితభావాన్ని ఈ విధంగా అభినందిచారని వారు అన్నారు. ప్రజలు ఇంకా వైఎస్సార్ పక్షాన్నే ఉన్నారని, 2009 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుందని నమ్మకాన్ని వ్యక్తపరిచారు.