కరీంనగర్ జెడ్పీలో తిట్ల పురాణం
కరీంనగర్: కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం సభ్యుల మధ్య ఘర్ణణ వాతావరణం నెలకొంది. పరస్పరం దూషణలకు దిగారు. ఇరు పార్టీల సభ్యుల మధ్య తోపులాట జరిగింది. పరస్పరం చేయి చేసుకునేదాకా పరిస్థితి వెళ్లింది. ఈ స్థితిలో చైర్మన్ సభను వాయిదా వేశారు.
తెలుగుదేశం సభ్యులు అర్థనగ్న ప్రదర్శన చేశారు. అధికారులు లేకుండా ఎలా సమావేశం నిర్వహిస్తారని తెలుగుదేశం సభ్యులు అడిగారు. దానికి చైర్మన్ వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడంతో గందరగోళం ప్రారంభమైంది.












Click it and Unblock the Notifications
